ఏసీలు, కూలర్ల వాడకంపై మార్గదర్శకాలు

by Shyam |
ఏసీలు, కూలర్ల వాడకంపై మార్గదర్శకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రిఫ్రిజిరేటింగ్ అండ్ కండిషనర్ ఇంజినీర్స్ (ఐఎస్‌హెచ్ఆర్ఏఈ) మార్గదర్శకాల ప్రకారం.. ఇళ్లలో ఏసీలు వాడేటప్పుడు 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలని, తేమస్థాయి 40 నుంచి 70 వరకు ఉంటే మంచిదని స్పష్టం చేసింది.

మంచి వెంటిలేషన్ కోసం కూలర్లు బయటి గాలిని పీల్చుకునేలా ఏర్పాటు చేసుకోవాలని, కూలర్‌ ట్యాంకులు ఎప్పటికప్పుడు క్రిమి సంహారాలతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. తరచూ నీటిని ఖాళీ చేసి మళ్లీ నింపుకోవాలని, బయట గాలిని పీల్చుకోలేని పోర్టబుల్ కూలర్లు వాడకపోవడమే మంచిదని తెలిపింది.
అటు.. ఫ్యాన్లు వినియోగించేవారు కిటీకీలు కొద్దిగా తెరిచి ఉంచుకోవాలని, దగ్గర్లో ఏదైనా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే.. తగిన వెంటిలేషన్ కోసం దాన్ని ఆన్‌లో ఉంచుకోవాలని కోరింది. కొవిడ్-19పై చైనాలోని వంద నగరాల్లో చేసిన అధ్యయనం ప్రకారం.. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ ఈ వైరస్‌ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తున్నట్టు గుర్తించారు.

tags: Corona Virus, Prevention, Center, New Guidelines, ISHRAE, AC, Cooler, Fan, Temperature, Ventilation, China, Covid 19

Advertisement

Next Story

Most Viewed