పైలట్ ప్రాజెక్టుగా ‘గుడికో గోమాత’

by srinivas |
పైలట్ ప్రాజెక్టుగా ‘గుడికో గోమాత’
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని 28దేవాల‌యాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాల‌ని టీటీడీ నిర్ణయించింది. గురువారం సాయంత్రం తిరుమల అన్నమమయ్య భ‌వ‌నంలో హిందూ ధర్మప్రచార ప‌రిష‌త్ కార్యనిర్వాహక మండ‌లి స‌మావేశం ఈమేరకు తీర్మానించింది. సమావేశానికి టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. హిందూ ధర్మప్రచార ప‌రిష‌త్, ఎస్వీ గోసంర‌క్షణ‌శాల ఆధ్వర్యంలో అమ‌లు చేయ‌నున్నారు. తెలంగాణ‌లోని పాత 10 జిల్లాలు, ఏపీలోని 13జిల్లాల్లో జిల్లాకు ఒక ఆల‌యం చొప్పున‌, క‌ర్ణాట‌కలోని 5దేవాల‌యాల్లో క‌లిపి మొత్తం 28ఆల‌యాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా దేశ‌వాళీ ఆవుల దానాన్ని స్వీక‌రించాల‌ని తీర్మానించారు. మ‌ఠాలు, పీఠాలు, వంశ‌పారంప‌ర్య పర్యవేక్షణ ఆల‌యాలు, దేవాదాయ శాఖ ప‌రిధిలోని ఆల‌యాలు, వేద పాఠ‌శాలల‌కు టీటీడీ గోవును అంద‌జేస్తుంది. గోదానం పొందిన సంబంధిత ఆల‌యాలు, పీఠాలు, వేద‌పాఠ‌శాల‌లు గోవుల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. దానం పొందిన గోవుల వ‌ద్ద గుడికో గోమాత – టీటీడీ అనే బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed