బిగ్ బ్రేకింగ్.. GSLV-F10 రాకెట్ ప్రయోగం ఫెయిల్

by Anukaran |   ( Updated:2021-08-11 23:26:11.0  )
బిగ్ బ్రేకింగ్.. GSLV-F10 రాకెట్ ప్రయోగం ఫెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత శాస్త్రవేత్తలకు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన GSLV-F10 రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి సరిగ్గా 5 గంటల 43 నిమిషాలకు GSLV-F10ని ప్రయోగించారు. కొన్ని సెకన్లలోనే నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. కానీ క్రయోజనిక్ దశలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 10 రాకెట్ తోనే సమస్య వచ్చినట్టు సైంటిస్టులు గుర్తించారు. ఈ హఠాత్ పరిణామంతో ఇస్రో సైంటిస్టులు ఒక్కసారిగా లైవ్ సోర్స్‌ను నిలిపివేశారు. రెండు స్టేజ్‌ల వరకు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తిందని.. ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో రాకెట్ వెళ్లడంతో జీఎస్‌ఎల్‌వీ ఫెయిల్ అయిందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed