పంజాబ్‌లో హై అలర్ట్.. ప్రకటించిన ఆర్మీ..

by Shamantha N |   ( Updated:2021-11-22 00:22:31.0  )
Punjab
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రక్షణ పరంగా ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. తాజాగా పంజాబ్‌లోని ఆర్మీ గేట్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. అటుగా వెళుతున్న పెళ్లి బందోబస్తును ఆసరాగా చేసుకొని దుండగులు ఈ పనికి పాల్పడ్డారు. దీంతో చుట్టుపక్కల చెక్ పోస్ట్‌లకు హైఎలర్ట్ ప్రకటించారు. ఈ ఘటన పంజాబ్‌ పఠాన్‌కోట్‌లోని త్రివేణి ఆర్మీ గేట్ దగ్గర చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం ఎస్ఎస్‌పీ సురేందర్ మీడియాకు పలు విషయాలను వెల్లడించారు.

‘స్థానికంగా జరుగుతున్న పెళ్లి సందర్భంగా భారీ ఊరేగింపు అటుగా వస్తోంది. వారికి దారి ఇచ్చిన క్రమంలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి ఆర్మీ గేట్ వద్ద గ్రైనేడ్ వేశాడు. ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనా స్థలంలో గ్రైనేడ్ ముక్కలను సేకరించాము. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ని ఆధారంగా చేసుకొని పరిస్థితిని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని పఠాన్‌కోట్ ఎస్ఎస్‌పీ సురేంద్ర లంబా తెలిపారు.

Advertisement

Next Story