ఉగ్రవాదుల టార్గెట్ మిస్.. పౌరుల బలి

దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా ఆజాద్ గంజ్ ఏరియాలో భద్రతా దళాల పెట్రోలింగ్ కాన్వాయ్‌ను టార్గెట్ చేసుకొని గ్రనేడ్ దాడి చేశారు. అయితే, గ్రనేడ్ కాన్వాయ్ వెళ్లిపోయిన తర్వాత పేలడంతో.. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఐదుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు పేలుడు జరిగిన ఏరియా అంతటా గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement