జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ బోల్తా..

దిశ, వెబ్‌డెస్క్ :

అమరావతి టు కడప జాతీయ రహదారిపై గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా కొమరోలు వద్ద బుధవారం తెల్లవారు జామున వెలుగులోకి వచ్చింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు లారీ డ్రైవర్ వివరించాడు.

అయితే, లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో గ్రానైట్ లారీ మార్టూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు డ్రైవర్ వెల్లడించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement