అర్ధరాత్రి అమానుషం.. లక్షరూపాయిల కోసం నానమ్మను అలా చేశారు

by Sumithra |   ( Updated:2021-05-24 02:43:05.0  )
అర్ధరాత్రి అమానుషం.. లక్షరూపాయిల కోసం నానమ్మను అలా చేశారు
X

దిశ, కామారెడ్డి : లక్ష రూపాయల కోసం వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కామారెడ్డి మండలం జగదాంబ తండాలో చోటుచేసుకుంది. తండా వాసులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బుక్యా కపూరి(72) కు ఒక కుమారుడు మోతీరాం ఉన్నాడు. ఆయనకు ఐదుగురు కుమారులు పెంట్యా, శంకర్, రాము, రాజు, శ్రీనివాస్. ఇందులో నలుగురి పెళ్లిళ్లు కాగా శ్రీనివాస్ కు ఈ నెల 21 న వివాహం జరిగింది. అయితే శ్రీనివాస్ వివాహం కోసం రెండు లక్షలు అప్పు తేగా అందులో లక్ష 5 వేలు మిగిలాయి. ఆ డబ్బులు కావాలని కపూరి మనవళ్లు శంకర్, రాజు గత రెండు రోజులుగా అడుగుతుండగా కపూరి ఇవ్వలేదు.

దాంతో ఆదివారం అర్ధరాత్రి కపూరి ఇంటి బయట నిద్రిస్తుండగా అదే తండాకు చెందిన తమ స్నేహితుడు గంగావత్ గణేష్తో కలిసి శంకర్, రాజు ముగ్గురు కలిసి కొడవళితో కపూరి గొంతు కోసి హత్య చేశారు. అనంతరం కపూరి వద్ద ఉన్న డబ్బులు తీసుకుని పారిపోయారు. తెల్లవారు జామున చూడగా కపూరి మృతి చెందింది. ఆమె హత్యకు గురైన విషయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు తండాకు చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కామారెడ్డి డీఎస్పీ సోమనాథం తెలిపారు.

Advertisement

Next Story