ఓపెన్ సెల్స్‎పై 5శాతం దిగుమతి సుంకం..!

by  |
ఓపెన్ సెల్స్‎పై 5శాతం దిగుమతి సుంకం..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి టెలివిజన్ (Television)తయారీకి కీలకమైన ఓపెన్ సెల్స్‌ (open cells)పై 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని (customs tariff) అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశీయంగా టీవీ పరిశ్రమ రూ. 25 వేల కోట్ల మార్కెట్‌ను కలిగి ఉంది. తాజా సుంకం(Tariff) అమలు కొనసాగింపుతో దేశంలోని టీవీ తయారీదారులపై అదనపు భారం పడుతుందని టీవీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, టీవీ ధరల పెరుగుదల అంశంతో ప్రభుత్వ వర్గాలు ఏకీభవించలేదు.

ఈ సుంకం వల్ల పెరిగే ధరలో ఒక టీవీపై రూ. 250 కంటే ఎక్కువ ఉండదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. పరిశ్రమ వర్గాలు చెబుతున్న స్థాయిలో ధరల పెరుగుదలను వారు తోసిపుచ్చారు. ‘ప్రముఖ బ్రాండ్లు (Brands)32 అంగుళాలకు రూ. 2700, 42 అంగుళాల టీవీకి సుమారు రూ. 4000 నుంచి రూ. 4500 వరకు ఓపెన్ సెల్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. ఓపెన్ సెల్‌పై 5 శాతం సుంకం ఎక్కువ ప్రభావం చూపించదు. ఒక టీవీపై రూ. 150-రూ. 250 కంటే ఎక్కువ ఉండదని వారు చెబుతున్నారు. కాగా, ఒక సంవత్సరం పాటు ఓపెన్ సెల్‌కు ఇచ్చిన కస్టమ్స్ సుంకం మినహాయింపు సెప్టెంబర్‌తో 30తో ముగియనున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed