- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బ్యాంకుల ప్రైవేటీకరణకు ఆర్‌బీఐతో కలిసి పనిచేస్తాం’
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్-2021లో ప్రకటించిన విధంగా బ్యాంకుల ప్రైవేటీకరణను అమలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)తో కలిసి పనిచేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తెలిపారు. అయితే, ప్రైవేటీకరణకు ఎంపిక చేసిన బ్యాంకుల పేర్లను మాత్రం ఆమె వెల్లడించలేదు. దీనికి అవసరమైన వివరాలను సిద్ధం చేస్తున్నామని, రానున్న రోజుల్లో ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు.
బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను నిర్వహించే ఎలాంటి బ్యాంకు పెట్టుబడి సంస్థను ఏర్పాటు చేయడంలేదని అన్నారు. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్‌సీ) పేరుతో రానున్న బ్యాడ్‌బ్యాంక్ గురించి మాట్లాడుతూ..బ్యాంకుల నిరర్ధక ఆస్తుల బదిలీ కోసం ఏర్పాటయ్యే ఏఆర్‌సీ ప్రభుత్వం తరపు నుంచి హామిని కలిగి ఉంటుందని, బ్యాంకుల పనితీరు మెరుగుపడేందుకు ప్రభుత్వ కృషి చేస్తుందని వివరించారు.
Advertisement
Next Story