- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముచ్చటగా మూడోసారి.. ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెండ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవీపేట్ మండలం ఆశాజ్యోతి కాలనీ మండల ప్రజా పరిషత్ పాఠశాల ఎస్‌జీటీ రాంచందర్ పై జనవరిలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రామచందర్ పై మోసపోయిన బాధితులు భరత్ గాంధీ మూడవ టౌన్ పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నాటి నుంచి తప్పించుకు తిరుగుతున్న రామ్ చందర్ మూడో టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాంచందర్ పై కేసు నమోదు కావడంతో సస్పెన్షన్ చేస్తూ డీఈఓ ఒక ప్రకటన జారీ చేశారు.
ముచ్చటగా మూడోసారి.. విద్యాశాఖ తీరు పై విమర్శలు..
నవీపేట్ మండలం ఆశజ్యోతి కాలనీ ఎంపీపీఎస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాంచందర్ సస్పెండ్ కావడం ముచ్చటగా మూడోసారి. గతంలో రెండు సార్లు జిల్లా విద్యాశాఖాధికారులు విధులకు ఎగనామం పెడుతున్నారనే కారణంతో సస్పెండ్ చేశారు. అయితే, చివరిసారిగా సస్పెన్షన్ ఐనా రాంచందర్ లాక్‌డౌన్ స్కూల్స్ మూసివేతకు ఒక్క వారం ముందుగా విధుల్లో చేరడం విశేషం. రాంచందర్ పై జిల్లా కేంద్రంలోని మూడో టౌన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. జనవరిలో ఎఫ్ఐఆర్ నమోదును గుర్తించని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు అతన్ని గత నెలలో ఏ విధంగా విధుల్లో చేర్చుకున్నారనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. గతంలో రెండు సార్లు రాంచందర్ పై వేటు పడినా ఒక యూనియన్ నాయకుడు విద్యాశాఖపై ఒత్తిడి తెచ్చి పోస్టింగ్ ఇప్పించడంలో సఫలమయ్యారు. డీఈఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరిలో కేసు నమోదై మీడియా ద్వారా బయటకు పొక్కితే విద్యా శాఖధికారులు మాత్రం పోలీసులు మంగళవారం సమాచారం ఇచ్చారని కవర్ చేసుకొచ్చారు. అనంతరం బుధవారం రాంచందర్‌ను సస్పెండ్ చేశారు. కాగా, విద్యాశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.