రెండేళ్ల వరకూ మారటోరియం : కేంద్రం

by Harish |
రెండేళ్ల వరకూ మారటోరియం : కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్ :

మారటోరియం(Maratoriom) వెసులుబాటును రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్నట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మంగళవారం మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ (Intrest less)అంశంపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కరోనా (Carona) కారణంగా ఎక్కువగా దెబ్బతిన్న రంగాలను గుర్తించే పనిలో ఉన్నామని, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలను చేపడుతున్నట్టు కేంద్రం తరపున వాదనలు వినిపించిన సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ వివరించారు.

కరోనాను నియంత్రించేందుకు విధించిన కఠిన లాక్‌డౌన్ (Lockdown) వల్ల దేశ వృద్ధిరేటు (Growth rate) 23 శాతానికిపైగా కుదించుకుపోయిన అంశాన్ని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో మారటోరియం కాలానికి వడ్డీని విధించే అవకాశమున్నట్టు తుషార్‌ మెహతా తెలియజేయగా, అత్యున్నత న్యాయస్థానం. .న్యాయంగా ఆలోచించాలని కేంద్రానికి తెలిపింది. అంతేకాకుండా, ఈ అంశంపై విచారణను ఆలస్యం చేయాలనుకోవటం లేదని బుధవారానికి పూర్తిస్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది.

కరోనా నుంచి రుణగ్రహీతలకు (debtors) ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మారటోరియం వెసులుబాటు ఆగష్టు 31తో ముగిసింది. ఈ మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ వసూలు, దానిపై మరో వడ్డీ విధించడంపై సుప్రీంకోర్టు(Suprem court)లో పిటిషన్ వేశారు. అయితే, మారటోరియం తీసుకోవడం ద్వారా రుణాలను చెల్లించే కాలపరిమితి పెరుగుతుందని, వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది. దీనిపై కేంద్రం వైఖరి తెలియాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వడ్డీపై వసూలు చేయడంపై పిటిషన్ వేసిన గజేంద్ర శర్మ, మారటోరియంపై వడ్డీ లేకుండా రుణాలు తిరిగి చెల్లించే అవకశం కల్పించాలని ప్రభుత్వం, ఆర్‌బీఐలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed