- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైన్యంలో మహిళా అధికారులకు ఇక శాశ్వత కమిషన్
న్యూఢిల్లీ: భారత సైన్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్ఈ) కింద నియమితులైన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని పేర్కొంటూ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మీలో పనిచేస్తున్న ఎస్‌ఎస్‌సీ మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ ఇవ్వాలని ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలోనే నెల రోజుల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారత ఆర్మీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ నిర్ణయం సైన్యంలోని మహిళా అధికారుల సాధికారతను పెంపొందించడానికి, వారు మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న జడ్జి అండ్ అడ్వొకేట్ జనరల్ (జేఏజీ), ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్ (ఏఈసీ), ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఏఏడీ), ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(ఏవోసీఏ)లతోపాటు భారత సైన్యంలోని మొత్తం పది స్ట్రీమ్‌లలో ఎస్‌ఎస్‌సీ మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు వెల్లడించారు.