యాడ్స్‌పై స్పష్టత కోసం ముసాయిదా..!

by Harish |
యాడ్స్‌పై స్పష్టత కోసం ముసాయిదా..!
X

దిశ, వెబ్‌డెస్క్: కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవల ప్రకటనలపై ఇప్పటి నుంచి మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో తాజాగా కొత్త మార్గదర్శకాలతో ముసాయిదాను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. యాడ్స్ రూపొందించడంలో చదువుకునేందుకు లేదా అర్థం చేసుకునేందుకు సులభంగా లేని అస్పష్టమైన ‘డిస్‌క్లైమర్లు’ వేస్తే.. అది వినియోగదారులను తప్పుదోవ పట్టించే యాడ్స్‌గా పరిగణించబడుతోంది. తాజా మార్గదర్శకాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఇటీవల ఏర్పాటైన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చర్యలకు బాధ్యులవుతారని పేర్కొంది.

అయితే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణకు ఉంచింది. అభిప్రాయాలను ఈ నెల 18లోగా తెలిపాలని కోరింది. తాజా మార్గదర్శకాలు ఉత్పత్తులు, సేవలపై ప్రకటనలను అందించే కంపెనీలు, యాడ్ ఏజెన్సీలకు వర్తించనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed