సెప్టెంబర్ గణాంకాలతో ఆశలు పెరిగాయి

by Harish |
సెప్టెంబర్ గణాంకాలతో ఆశలు పెరిగాయి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 7.5 శాతం సంకోచించడంతో ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనంపై ఆశలు ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు కె వి సుబ్రమణియన్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోని వరుస రెండు త్రైమాసికాల్లో జీడీపీ క్షీణత ప్రధానంగా కొవిడ్-19 మహమ్మారి కారణంగానే ప్రతికూలంగా ఉందని, కరోనా చుట్టూ ఉన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిపై ఆధారపడి ఆర్థిక పునరుద్ధరణ స్థిరత్వం ఆధారపడి ఉంటుందని సుబ్రమణియన్ తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కీలక సందర్భాన్ని దాటినప్పటికీ శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందన్నారు.

ఎందుకంటే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ముందుదానికంటే వినాశకరంగా ఉంటుందని ఆయన సూచించారు. కాబట్టి, జనాభాలో ఎక్కువమందికి టీకాలను అందజేసే వరకూ కరోనా నిబంధనలను ప్రజలు పాటించాలని చెప్పారు. ఇదివరకు పూర్తి ఆర్థిక సంవత్సర జీడీపీ వృద్ధి 8-9 శాతం ప్రతికూలం కంటే మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్పత్తి రంగం 0.6 శాతం, వినియోగం 4.4 శాతం, వ్యవసాయ రంగం 3 శాతానికి మించి వృద్ధి సాధించడంతో ఆర్థికవ్యవస్థకు సానుకూలంగా చూడవచ్చని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed