ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రాజేశ్వర్ రావు

by Anukaran |
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రాజేశ్వర్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్ రావును నియమిస్తూ ప్రభుత్వ బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. బుధవారం జరిగిన కేబినెట్ నియామక కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. రాజేశ్వర్ రావు ఆర్‌బీఐలో నియంత్రణ, పర్యవేక్షణ విభాగాలతో పాటు వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో 1984 నుంచి 36 సంవత్సరాల పాటు బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుత ఆయన సెంట్రల్ బ్యాంక్ అంతర్గత రుణ నిర్వహణ, మార్కెట్ కార్యకలాపాలు, అంతర్జాతీయ, సెక్రటేరియల్ విభాగాలకు బాధ్యత వహించనున్నారు.

Advertisement

Next Story