- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు మధ్యాహ్నం మర్రిగూడకు గవర్నర్ తమిళసై రాక
X
దిశ, మర్రిగూడ: మర్రిగూడ మండల కేంద్రానికి ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ తమిళ సై రానున్నారు. మండల కేంద్రంలోని గ్రామభారతి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణాలకు గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ శంకుస్థాపన చేయనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామభారతిలో 20 ఎకరాల స్థలం ఉండగా అదనంగా ఐదు ఎకరాలు లీజుకు తీసుకుని నిర్వాహకులు గ్రామభారతిని నిర్వహిస్తున్నారు. దీని ఆధ్వర్యంలో ప్రస్తుతం అనాథ విద్యార్థులకు హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గవర్నర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ లు శంకుస్థాపనకు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Advertisement
Next Story