గర్భిణీ మృతి పై గవర్నర్ సీరియస్..విచారణకు ఆదేశం

by  |
Governor Tamilisai
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ గిరిజన గర్భిణీ మృతి చెందడం పై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని గవర్నర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే..ఈనెల 19న జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కోయల్ పాండ్రి గ్రామానికి చెందిన పుర్క జయశీల అనే గర్భిణీ వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతుండగానే ఆమె చనిపోయింది. సరైన ట్రీట్ మెంట్ అందకపోవడం వల్లే ఆమె మరణించిందని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
జయశీల మృతితో పాటు, కడుపులో ఉన్న ఇద్దరు కవల పిల్లలు కూడా చనిపోయారని బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం గవర్నర్ వద్దకు చేరుకోవడంతో ఆమె సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా డీహెచ్‌ఎంవో డాక్టర్ నరేందర్ రాథోడ్, ఏజెన్సీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె మనోహర్ ఆధ్వర్యంలో ఓ బృందం కోయల్ పాండ్రి గ్రామానికి వెళ్లి గర్భిణీ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వర్గాల నుంచి పలు వివరాలను సేకరించారు.

డీహెచ్ఎంవో వివరణ :

రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు తమ బృందం గర్భిణీ మహిళ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టాం. రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు చికిత్స అందించడంలో ప్రాథమికంగా ఎలాంటి తప్ప దొర్లలేదని తేలింది. బాధితురాలు ఆస్పత్రికి వచ్చిన సమయంలో అధిక రక్తహీనత, బీపీ ఎక్కువగా ఉన్నది.ఈ క్రమంలోనే వైద్యానికి స్పందించక చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత లోతుగా విచారణ జరిపి గవర్నర్ కు నివేదిక అందజేస్తామని జిల్లా డీహెచ్ఎంవో నరేందర్ రాథోడ్ ప్రకటించారు.


Next Story

Most Viewed