స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రద్దు.. ఆ గవర్నర్ నిర్ణయం

by  |
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రద్దు.. ఆ గవర్నర్ నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ విలయతాండవం చేస్తోంది. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడింది. కాగా దీనిపై రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15న నిర్వహించే ఇండిపెండెన్స్ డే ‘ఎట్-హోమ్’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కోవిడ్ మహమ్మారిపై తన ఆందోళనను ఒక ప్రకటనలో ఆయన వ్యక్తం చేశారు.

‘రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల కారణంగా ఈసారి వార్షిక ఇండిపెండెన్స్ డే ఎట్-హోమ్ ఈవెంట్ చోటుచేసుకోవడం లేదు. ఈ ఈవెంట్‌ను రద్దుచేస్తున్నాం’ అని ఆ ప్రకటన పేర్కొంది. అసెంబ్లీ సమావేశాలు జులై 31 నుంచి నిర్వహించాలంటూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రెండోసారి చేసిన ప్రతిపాదనను కూడా గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా తోసిపుచ్చిన నేపథ్యంలో తాజాగా ఇండిపెండెన్స్ డే ‘ఎట్-హోమ్’ను రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Next Story

Most Viewed