రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం

దిశ, గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో ఇటీవల బ్యాగరి నరసింహులు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన బాధిత రైతు కుటుంబానికి మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు.. దేవి రవీందర్ రూ. 2లక్షల చెక్కును అందజేశారు. మృతుడి కూతురికి కాంట్రాక్ట్ ఉద్యోగం, వారి జీవనానికి ఎకరం భూమి కూడా ఇస్తామని రవీందర్ తెలిపారు. ప్రభుత్వం బాధిత రైతు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement