- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియాలో సంస్కరణలు కీలకం: ఎస్ అండ్ పీ గ్లోబల్
ముంబయి: 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఇండియా ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాల నుంచి రికవరీ పొందాలంటే సంస్కరణలు కీలకమని ఎస్ అండ్ పీ గ్లోబల్ అభిప్రాయపడింది. భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో 7శాతం వరకు వృద్ధిని నమోదు చేసే సత్తా ఉందని ఓ వెబినార్‌లో పేర్కొంది. గత 13ఏళ్లుగా ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియాకు తక్కువ పెట్టుబడి గ్రేట్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నది. ప్రస్తుత ఏడాదిలో క్షీణించినా వర్ధమాన దేశాల్లో మెరుగైన పనితీరును ప్రదర్శించే అవకాశాలు ఇండియాకు అధికంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 5శాతం క్షీణించవచ్చని, తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 8.5శాతం వృద్ధి ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది. ప్రస్తుత సంవత్సరం కోశ లోటు 11శాతం నమోదయ్యే పరిస్థితి ఉందని, వచ్చే ఏడాది 10శాతానికి పరిమితమవుతుందని అంచనాలను ప్రకటించింది. కరోనా మరింత విజృంభిస్తే భారత రేటింగ్‌ను తగ్గించక తప్పదని, అప్పుడు ఈ గణాంకాలు మారొచ్చని రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది.