- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఉద్యోగులు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి’
by Shyam |
దిశ, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో నగర శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నగర శాఖ అధ్యక్షుడు ఆర్.ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కరోనా బారిన పడగా.. ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే వారు దాని బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులను రెండుగా విభజించి 50 శాతం ఉద్యోగులతో పని చేయించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా జూన్ నెలకు సంబంధించి పూర్తి వేతనాలు ఇవ్వాలని, ఇప్పటికే కోతలు విధించిన వేతనాలను కూడా వీలైనంత త్వరలో ఉద్యోగులకు చెల్లించాలని ప్రతాప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నగర శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story