ఏపీలో ఆగస్ట్ 3 నుంచి ఆన్‌లైన్ క్లాసులు?

by  |
ఏపీలో ఆగస్ట్ 3 నుంచి ఆన్‌లైన్ క్లాసులు?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది స్కూల్స్ ప్రారంభమయ్యే సూచనలు కనబడకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించే ఆలోచనలో ఉంది. ఆగస్ట్ 3 నుంచి వచ్చే ఏడాది రెండోవారం వరకు క్లాసులను నిర్వహించేలా ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్లాసులు జరిగే రోజులు తగ్గుతుండటంతో సిలబస్‌ను కూడా 30 శాతం తగ్గించనున్నారు. 2021 మే తొలి వారంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అనంతరం జూన్ 12 వరకు వేసవి సెలవులు ఇచ్చేలా కేలండర్ రూపొందింస్తున్నారు.


Next Story

Most Viewed