- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం.. కూలిపోయే దశలో ప్రభుత్వ పాఠశాల..
దిశ, జడ్చర్ల : దాదాపు ఏడాదిన్నర తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ, వీరి ఆశలపై ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలు నీళ్లు చాల్లేలా ఉన్నాయి.
నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరి ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో ఏడవ తరగతి వరకు విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. అయితే పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలిపోయే దశలో ఉంది.
పాఠశాల గదుల గోడల వెంబడి నీరు లోపలికి వస్తుండగా గదులన్నీ పాకురు పట్టాయి. పాఠశాల గదుల్లో భవనం స్లాబ్ పెచ్చులూడి వర్షం నీరు కిందికి కారుతోంది. ఏ క్షణమైనా భవనం కూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను పాఠశాల గదిలో కూర్చోబెట్టి.. వారికి బోధించే పరిస్థితులు కనబడటం లేదు. ఈ నేపథ్యంలో పాఠశాలకు విద్యార్థులను పంపించే సాహసం స్టూడెంట్స్ తల్లిదండ్రులు చేస్తారా..?.
కరోనా కారణంగా తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారనే బాధ ఓ పక్క పేరెంట్స్ ఉండగా.. మరోవైపు పాఠశాల పరిస్థితి చూస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు మరింత భయపడుతున్నారు. పిల్లలను పాఠశాలకు పంపిస్తే వారికి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోననే భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. అధికారులు స్పందించి అదనపు తరగతి గదులను నిర్మించాలని.. అప్పటివరకు పాఠశాలను అద్దె గదుల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వారిని వేడుకుంటున్నారు.