- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలో ఆ ఉద్యోగులకు విధులు

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన ఉద్యోగులకు విధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది ఉద్యోగులు ఏపీకి అలాట్అయ్యారు. అప్పటి నుంచి వారిని స్వరాష్ట్రానికి పంపించాలని విన్నవిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట 498 మంది క్లాస్ –3, క్లాస్ –4 ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. అయితే వారికి కేటాయించిన శాఖల్లో ఇప్పటికే ఆ స్థానాలు భర్తీ కావడంతో నాలుగు నెలల నుంచి విధులులేక ఖాళీగా ఉన్నారు. గత నెల వరకు వారికి వేతనాలు కూడా మంజూరు చేయలేదు. జూన్ నెలలో మూడు నెలల వేతనాలను ఒకేసారి విడుదల చేశారు. తాజాగా 498 మంది ఉద్యోగులకు ఆయా శాఖల్లో విధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి సొంత శాఖల్లో ఖాళీలు లేకపోవడంతో వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. అత్యధికంగా వ్యవసాయ శాఖలోనే వారికి విధులు కేటాయించారు.