ప్రజలకో న్యాయం.. టీఆర్‌ఎస్ నేతలకు మరో న్యాయమా?

by Shyam |
ప్రజలకో న్యాయం.. టీఆర్‌ఎస్ నేతలకు మరో న్యాయమా?
X

దిశ, హైదరాబాద్: విధిలేని పరిస్థితుల్లో జర్నలిస్టులు ఉపవాస దీక్ష చేస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని దేశోద్ధారక భవన్‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ఒక రోజు జర్నలిస్టులు ఉపవాస దీక్ష చేపట్టారు. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించడంతో పాటు రూ.2 లక్షలు జర్నలిస్టుల సంక్షేమ నిధికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. జర్నలిస్టులను ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సానియా మీర్జా, సింధులకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, కోవిడ్ నియంత్రణ‌కు అహార్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్ట్‌లను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, దీంతో సాధారణ ప్రజలకు ఒక న్యాయం, టీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లురవి, కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తదితరలు పాల్గొని జర్నలిస్ట్‌లకు సంఘీభావం ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed