విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం..!

దిశ, అంబర్‎పేట్: రాష్ట్ర ప్రభుత్వానికి దుబ్బాక ఉప ఎన్నికపై ఉన్న ఆసక్తి… టీచర్ పోస్టుల భర్తీపై లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ… తెలంగాణా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో లక్డికాపుల్‎లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు లేరనే సాకుతో 4,600 ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ… విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు.

Advertisement