Green Signal To Anandayya Medicine: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by Anukaran |   ( Updated:2021-05-31 04:20:30.0  )
Green Signal To Anandayya Medicine: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం కరోనా విషయంలో సంబంధిత అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై కీలకంగా చర్చించారు. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం.. ఆనందయ్య మందుతో ఎలాంటి హాని లేదని తెలిసిన తర్వాత ఆనందయ్య మందుకు గ్నీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కంట్లో వేసే డ్రాప్స్ తప్ప ఇతర మందులకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కంటిలో వేసుకునే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రాలేదని అవి రావడానికి మరో రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉందని ఆయుష్ కమిషనర్ రాములు సీఎం జగన్‌కు వివరించారు. అలాగే ఆనందయ్య ఇచ్చే పీఎల్‌ఎఫ్ మందులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్ఎస్ నివేదిక ప్రకారం.. ఆనందయ్య మందు వాడితే కొవిడ్ తగ్గుతుందడానికి నిర్ధారణ లేదని నివేదిక స్పష్టం చేసింది. ఆనందయ్య మందుకోసం కొవిడ్ పాజిటివ్ ఉన్న రోగులెవరూ రావొద్దని, బంధువులు వచ్చి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మందు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది.

Jagan Government Has Given A Green Signal To Anandayya Medicine!!

Advertisement

Next Story

Most Viewed