గణపతి లొంగుబాటుకు ప్రభుత్వం గ్రీన్‎సిగ్నల్..!

by  |
గణపతి లొంగుబాటుకు ప్రభుత్వం గ్రీన్‎సిగ్నల్..!
X

దిశ వెబ్‎డెస్క్: మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గణపతి కుటుంబసభ్యులు లేదా బంధువులతో నేరుగా సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు. అంతకు ముందు జంపన్న, సుధాకర్‎కు సహకరించినట్టే గణపతికి సహకరిస్తామని పోలీసులు అన్నారు. ఇక గణపతికి వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలపై సహాయం అందిస్తామని అన్నారు. గణపతితో సహా మావోయిస్టులు ఎవరు లొంగిపోయినా స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.



Next Story

Most Viewed