అంతా మా ఇష్టం.. 10.50 దాటినా ఆఫీసుకు రాని ప్రభుత్వ ‘పెద్దసార్లు’..

by Shyam |   ( Updated:2021-10-29 00:51:30.0  )
అంతా మా ఇష్టం.. 10.50 దాటినా ఆఫీసుకు రాని ప్రభుత్వ ‘పెద్దసార్లు’..
X

దిశ, జనగామ : ఉదయం పది గంటలకు విధులకు హాజరు కావలసిన అధికారులు, సిబ్బంది, సమయం దాటినా విధుల్లోకి రాలేదు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను హుస్నాబాద్ రోడ్డులోని వడ్లకొండ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేశారు. అయితే, టైమింగ్స్ ప్రకారం.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు విధులకు రావాల్సిన అధికారులు.. 10.50 A.M అయినా ఆఫీసుకు రాలేదు.

శుక్రవారం ‘దిశ’ పరిశీలనలో జిల్లా మద్య నిషేధం, ఆబ్కారీ కార్యాలయం అధికారులు, జిల్లా ఉపాధి కార్యాలయం ఉద్యోగులు, జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో ఉద్యోగులు, అధికారులు.. ఉదయం సమయం 10.50 దాటినా ఆఫీసుకు రాకపోవడాన్ని గమనించింది. కింది స్థాయి ఉద్యోగులు సైతం ఉదయం 10.50 వచ్చి ఆఫీసు తాళాలు ఓపెన్ చేస్తుండటం గమనార్హం.

అయితే.. గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదైనా పని కోసం జిల్లా కార్యాలయాలకు వచ్చిన ప్రజలు అధికారుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జిల్లా కలెక్టర్.. ఉద్యోగులందరూ సమయానికి ఆఫీసుకు రావాలని ఆదేశించినప్పటికీ వారిలో మార్పు రాలేదు.

Advertisement

Next Story

Most Viewed