మద్యం ధరలపై ఏపీ కీలక నిర్ణయం

by  |
మద్యం ధరలపై ఏపీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను క్రమబద్దీకరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చీప్ లిక్కర్‌పై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ప్రీమియర్‌ లిక్కర్‌పై మాత్రం ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరలను క్రమబద్దీకరిస్తూ మార్పులు చేసి.. రూ.150 కంటే తక్కువ ఉన్న మద్యం ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. 90ఎంల్ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలు పెంచుతూ, బీర్లు, రెడి టు డ్రింక్ ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వైసీపీ అధికారంలోకి రాగానే వైన్‌షాపుల సంఖ్యను తగ్గించి.. మధ్యం ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ సరిహద్దుల నుంచి ఏపీ ప్రజలు మద్యం తీసుకెళ్తూ పట్టుబడుతున్నారు. ఇదే క్రమంలో నిన్న హైకోర్టు పక్క రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని స్పష్టం చేయడంతో మరుసటి రోజే ఏపీ సర్కార్‌ చీప్ లిక్కర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.


Next Story