- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పరిహారం ఇచ్చాకే.. పనులు ప్రారంభించండి

దిశ, హుస్నాబాద్: పరిహారం ఇచ్చిన రోజే పనులు ప్రారంభించాలని భూ నిర్వసితులు ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. బుధవారం అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులను కాంట్రాక్టర్లు ప్రారంభించేందుకు ప్రయత్నించగా భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కింద ముంపుకు గురవుతున్న కుటుంబాలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలతో పాటు పునరావాస ప్యాకేజీ పరిహారం అందిస్తామని ఆఫీసర్లు సంతకాలు చేయింకొని ఏడాది కావస్తున్నా, నేటికీ ఒక్క పైస ఇవ్వలేదని మండిపడ్డారు. నష్టపరిహారం రాలేదని కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితులు గత నాలుగు నెలల క్రితం గుడాటిపల్లి వద్ద జరుగుతున్న ప్రాజెక్టు పనులను అడ్డగించడంతో అధికారులు పనులు పూర్తిగా నిలిపివేశారు. నష్టపరిహారం చెల్లించేవరకూ ఇక్కడి ప్రాజెక్టు పనులు జరగనివ్వమని తెల్చి చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో 40 మంది భూ నిర్వాసితులు ప్రాజెక్టు పనులు అడ్డుకోగా పోలీసులు వారిని సముదాయించారు.