ఫెడరల్ వ్యవస్థను కాపాడుతున్నాయా: గోరంట్ల

by  |
ఫెడరల్ వ్యవస్థను కాపాడుతున్నాయా: గోరంట్ల
X

దిశ, వెబ్‌డెస్క్: ఫెడరల్ (సమాఖ్య), యూనిటరీ(ఏకీకృత) విధానం.. మన రాజ్యాంగం మనకి ఇచ్చిన గొప్ప అవకాశం.. అయితే.. ప్రభుత్వాలు ఫెడరల్ స్ఫూర్తి‌తో పని చేయాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులకి అనుగుణంగా మార్పులు చేసుకుని ఏకీకృత విధానం ద్వారా కూడా వెళ్లొచ్చు అని రాజ్యాంగం చెప్పిందంటూ గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితి నిజంగా ఫెడరల్ వ్యవస్థని కాపాడుతున్నాయా! అంటూ గోరంట్ల సందేహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో రాష్ట్రాల హక్కులు కాల రాసే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగ విధానానికి లోబడి ఫెడరల్ స్పూర్తితో పని చేయాలి.. రాష్ట్రాల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని గోరంట్ల అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed