- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒకే వేదికపై..ఓటీటీలు
దిశ, వెబ్ డెస్క్: కెలిడియోస్కోప్..చిన్నప్పటి ఓ అందమైన జ్ఞాపకం. సిలిండర్ ఆకారంలో ఉండే..ఈ పరికరం నుంచి చూస్తే..రకరకాల రంగులు కనిపిస్తూ భలే చిత్రంగా అనిపిస్తుంది. చిన్నితెరపై భిన్నమైన రంగుల్ని అది మన కంటి ముందరకు తీసుకొస్తే..ఇప్పుడు వెండితెరను మన ఇంట్లోకి తీసుకొచ్చింది ఓటీటీ. విడుదల ముందు అభిమానుల సందడిని, సినిమా హాల్లోని ఈలలు, గోలలు, పేపర్ల వర్షాన్ని మిస్ అవుతున్నాం కానీ, మూవీని మాత్రం మిస్ కాకుండా చూసేందుకు ఇప్పుడు ఓటీటీనే మనకు మార్గం. అయితే, నెట్‌ప్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, ఆహా, జీ5 ఇలా బోలెడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చేశాయి. మరి అన్నీ ఒకే గొడుగు కిందకు వస్తే.. భలే ఉంటుంది కదా. అదే ఆలోచనతో గూగుల్ ‘క్రోమ్ కెలిడియోస్కోప్’తో మన ముందుకు రాబోతుంది.
ఓటీటీ కంటెంట్‌ను ఒకే వేదికపై అందించేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. కెనరీ వెర్షన్ క్రోమ్‌లో ఈ సదుపాయం త్వరలో రానుంది. ఈ విషయాన్ని గూగుల్ తన క్రోమ్ స్టోరీపై వివరించింది. ‘అన్ని రకాల షోలు.. ఒకే తెరపై. అవి ఏ ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేస్తుందో అని దిగులు వద్దు. కేవలం ప్రొవైడర్స్‌ను సెలెక్ట్ చేసుకోండి’ అని గూగుల్ రాసుకొచ్చింది. ఇందుకోసం ‘క్రోమ్ కెలిడియోస్కోప్’ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ ఫీచర్ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్‌లను సింక్ చేస్తుంది. అయితే, ఇందులో యూట్యూబ్‌ను మాత్రం యాడ్ చేయలేదు. ఎందుకంటే..యూట్యూబ్‌లో మిక్స్ ఆఫ్ ఒరిజనల్ కంటెంట్‌ను చూపిస్తుంది. దాంతో పాటు యూజర్ జనరేటెడ్ కంటెంట్ కూడా అందిస్తోంది. అందువల్ల దీన్ని కెలిడియోస్కోప్‌కు యాడ్ చేయలేదు. గూగుల్ ఈ ఫీచర్‌ను ఎప్పుడూ లాంచ్ చేయబోతున్న విషయం చెప్పలేదు. ఇది అందుబాటులోకి వస్తే.. పీసీ బ్రౌజర్ మార్కెట్లో టాప్‌లోకి వస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. మైక్రోసాప్ట్ ఎడ్జ్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌లకు గట్టిపోటీ ఇస్తుందని అంటున్నారు.