ఆగస్టులో భారతీయులు ఏం సెర్చ్ చేశారంటే?

by  |
ఆగస్టులో భారతీయులు ఏం సెర్చ్ చేశారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ చిన్న అవసరానికైనా గూగుల్ తల్లే దిక్కు. కానీ మనం అడిగేవన్నింటినీ గూగుల్ తల్లి గుర్తుపెట్టుకుని ప్రతి నెలా విశ్లేషిస్తుంది. ఈ క్రమంలోనే గత నెలలో భారతీయ వినియోగదారులు ఆ తల్లిని ఏమేం అడిగారనే విషయాన్ని గూగుల్ విడుదల చేసింది. అందరూ ఊహించినట్లుగా ఎక్కువగా సెర్చ్ ఇంట్రెస్ట్ గల పదాల్లో కొవిడ్ 19, కొవిడ్ వ్యాక్సిన్ ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇండిపెండెన్స్ డే, ప్రణబ్ ముఖర్జీ, పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ పదాలు కూడా టాప్ స్థానాల్లో నిలిచాయి. గూగుల్ విడుదల చేసిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ పదానికి 5000 శాతానికి మించి సెర్చ్ ఇంట్రెస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో 4000 శాతం సెర్చ్ ఇంట్రెస్ట్‌తో ప్రణబ్ ముఖర్జీ పదం నిలిచింది.

ఇండిపెండెన్స్ డే విషయానికి గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది ఆ పదం సెర్చ్ ఇంట్రెస్ట్ కొత్త రికార్డును సృష్టించిందని గూగుల్ తెలిపింది. ఈ ఏడాది 3750 శాతంతో ఇండిపెండెన్స్ డే అనే పదం రికార్డుకెక్కింది. గత రికార్డు ఆగస్టు 2018లో నమోదైంది. ఇవి కాకుండా లెబనాన్ పదాన్ని 2100 శాతం సెర్చ్ ఇంట్రెస్ట్ రాగా, కొవిడ్ 19 ప్రివెన్షన్ అనే పదాన్ని 1600 శాతం సెర్చ్ ఇంట్రెస్ట్ వచ్చినట్లు గూగుల్ నివేదిక వెల్లడించింది. వీటితో పాటు మార్చి నెల నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కరోనా వైరస్ పదానికి ఈ నెలలో పెద్దగా క్రేజ్ లేకుండా పోయింది. దీనికి సంబంధించి అమిత్ షా కరోనావైరస్, వ్యాక్సిన్ ఫర్ కరోనా లేటెస్ట్, వ్యాక్సిన్ వంటి పదాలు ట్రెండీగా ఉన్నాయి. అదనంగా, స్పుత్నిక్, స్పుత్నిక్ వ్యాక్సిన్ పదాలు వరుసగా 3300 శాతం, 2750 శాతం సెర్చ్ ఇంట్రెస్ట్ సంపాదించుకున్నాయి.


Next Story

Most Viewed