- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూమ్‌ను మించిన ఫీచర్‌తో గూగుల్ మీట్!
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇలాంటి సమయంలో జూమ్ లాంటి యాప్ సమస్యాపూరితం కావడంతో దీనికి ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ సంస్థ హ్యాంగ్ అవుట్ మీట్‌ను గూగుల్ మీట్ పేరుతో మార్పులు చేసింది. ఇప్పటివరకు గూగుల్ మీట్‌లో ఒకేసారి నలుగురు వ్యక్తులతో మాత్రమే మాట్లాడే వీలుండేది. దీన్ని ఒకేసారి 16కు పెంచింది. మరింత ఆశ్చర్యపరిచే విషయమేంటంటే…వీడియో మాట్లాడుతున్నప్పుడు లైటింగ్ కండిషన్ సరిగా లేకపోయినప్పటికీ గూగుల్ మీట్‌లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ స్పష్టమైన రూపం ఉండేలా సహకరిస్తుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మొబైల్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ఇందులోనే మీటింగ్స్‌లో వీడియో, ఆడియో కంటెంట్‌ను షేర్ చేసుకునేందుకు ‘ప్రజెంట్ ఏ క్రోమ్ ట్యాబ్’ను ఇన్‌బిల్ట్ చేశారు. నాయిస్ కేన్సిలేషన్ సదుపాయాన్ని తీసుకువస్తామని గూగుల్ పేర్కొంది. వీటితోపాటు వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు వెనకవైపు ఎవరైనా కదిలినా ఇబ్బంది కలగకుండా గూగుల్ మీట్‌లో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. పెద్ద సంఖ్యలో మీటింగ్‌లకు ఇది ఎంతో ఉపయుక్తమైందని, అత్యుత్తమ లే అవుట్‌లతో మరిన్ని డివైజ్‌లకు ఇది సపోర్ట్ చేసే చూస్తామని వెల్లడించింది. వినియోగదారుల డేటా భద్రతకు కూడా భరోసా ఇస్తామని గూగుల్ వివరించింది.
Tags: google, Google Meet, zoom