దొంగ యాప్‌లపై గూగుల్ కన్నెర్ర

by Shamantha N |
దొంగ యాప్‌లపై గూగుల్ కన్నెర్ర
X

దిశ, వెబ్‌‌డెస్క్: వినియోగదారులకు సంబంధించిన డేటాకు సరైన భద్రత లేకుండా, యూజర్ల గోప్యతకు భంగం కలిగించే కొన్ని యాప్ లపై గూగుల్ కొరడా ఝుళిపించింది. ఫోన్లలో ఫేస్ బుక్ లాగిన్ వివరాలు, పాస్ వర్డ్ లను చోరీ చేస్తున్న 25 యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లు ఓ మాల్వేర్ తో ఇన్ స్టాల్ అవుతున్నాయని, ఆ మాల్వేర్ ఫోన్‌లో తిష్టవేసి ఫేస్‌బుక్ లాగిన్ వివరాలను దొంగిలిస్తోందని.. ఎవినా అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ గూగుల్‌ను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ సదరు యాప్‌లపై నిషేధం విధించింది. ఈ యాప్‌లు ఫైల్ మేనేజర్స్, ఫ్లాష్ లైట్స్, వాల్ పేపర్ మేనేజ్ మెంట్, స్క్రీన్ షాట్ ఎడిటర్, వాతావరణం తదితర అంశాలకు చెందినవని ఎవినా వెల్లడించింది.

Advertisement

Next Story