చైనా యాప్స్‌పై గూగుల్ కీలక ప్రకటన

by Shamantha N |
చైనా యాప్స్‌పై గూగుల్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ భూభాగంపై కన్నెసిన చైనాకు గట్టి బుద్ది చెప్పాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ఆ దేశానికి చెందిన 59 యాప్స్‌ను నిషేధించింది. ఈ నేపథ్యంలో గూగుల్ చైనా యాప్స్ పై గురువారం కీలక ప్రకటన చేసింది. భారత్ బ్యాన్ చేసిన చైనా యాప్స్‌ను ప్లే స్టోర్‌లోనే ఉంచామని..అయితే భారత్‌లో అందుబాటులో లేకుండా తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు సదరు యాప్స్ డెవలపర్స్‌కు కూడా సమాచారం అందించామని పేర్కొంది. అయితే, బ్యాన్ చేసిన యాప్స్‌లో ఎన్నింటిని బ్లాక్ చేశారో గూగుల్ ప్రతినిధి స్పష్టత ఇవ్వలేదు. సదరు యాప్ డెవలపర్లే గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్వచ్ఛందంగా యాప్స్‌ను తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, భారత్ డ్రాగన్ కంట్రీకి చెందిన టిక్‌టాక్‌ సహా 59 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story