- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక నుంచి గూగూల్ లో ఉచితంగా ఆ కోర్సులు.. మీకు ఆసక్తి ఉంటే చాలట !
దిశ, ఫీచర్స్ : మెషిన్ లెర్నింగ్‌పై గూగుల్ ఉచిత ఆన్‌లైన్ కోర్సును అందిస్తోంది. ‘మెషిన్ లెర్నింగ్ క్రాష్ కోర్సు విత్ టెన్సర్‌ఫ్లో ఏపీఐ’ పేరుతో ఆఫర్ చేస్తున్న ఈ కోర్సును 15 గంటల్లోనే పూర్తి చేయొచ్చు. ఇందులో లెక్చర్స్, రియల్-వరల్డ్ కేస్ స్టడీస్, హ్యాండ్-ఆన్ ప్రాక్టీస్ ఎక్సర్‌సైజ్‌కు సంబంధించిన సిరీస్ ఆఫ్ లెస్సన్స్ ఉంటాయి.
ఆసక్తిగల వ్యక్తులు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపెంట్లకు ముందస్తుగానే మెషీన్ లెర్నింగ్‌లో పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ కోర్స్ సమయంలో ప్రజెంట్ చేసే కాన్సెప్ట్స్ అర్థం చేసుకునే సామర్థ్యముండాలి. ఇందులో పాల్గొనేవారికి మెషీన్ లెర్నింగ్, నమ్‌పై(NumPy), పాండాలు, బీజగణితం, త్రికోణమితి, కాలిక్యులస్ మొదలైన వాటి గురించి ప్రాథమిక జ్ఞానం ఉండాలి. మెషీన్ లెర్నింగ్‌లో పాల్గొనేవారు కొత్తవారైతే.. వారు గూగుల్ అందించే ‘మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ ఫ్రేమింగ్’లో చేరొచ్చు. ఇందులో ఒక గంట పాటు సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా బేసిక్స్ నేర్పిస్తారు.
అభ్యర్థులు ప్రోగ్రామర్లు అయ్యి ఉండాలి. తప్పనిసరిగా వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్స్ , ఫంక్షనల్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్స్ తెలిసి ఉండాలి. ప్రోగ్రామింగ్ ఎక్సర్‌సైజెస్ పైథాన్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. అందువల్ల పైథాన్‌పై పరిజ్ఞానం ఉండటం ఉత్తమం. మెషిన్ లెర్నింగ్ ఇంట్రడక్షన్, ఫ్రేమింగ్, ఇన్‌డెప్త్ మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలు ఇందులో నేర్పిస్తారు. ఇతర ప్రోగ్రామింగ్ పద్ధతులతో మెషిన్ లెర్నింగ్ సరిపోల్చడం.. తేడాలు గమనించడం కూడా నేర్పిస్తారు.