- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడియో కాలింగ్ రంగంలో నెగ్గాలనుకుంటున్న గూగుల్
దిశ, వెబ్‌డెస్క్: హ్యాంగౌట్స్ పేరుతో గూగుల్ మొదటినుంచే వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కల్పించింది. అయితే విద్యావ్యాపార సంబంధ అంశాలకు కాకుండా ఈ హ్యాంగౌట్స్ ఎక్కువగా వ్యక్తిగత వీడియో కాలింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. అయితే వ్యాపార సంబంధ కాల్స్ కోసం వినియోగదారులు జూమ్ వంటి యాప్‌లను ఆశ్రయించారు. వీటికి పోటీగా గూగుల్ మీట్ పేరుతో కొత్త యాప్ పరిచయం చేసినప్పటికీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అంతేకాకుండా మీట్‌కి ప్రత్యేకంగా విడి లాగిన్ పెట్టడంతో సమస్య పెద్దదైంది. కానీ ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ కారణంగా వీడియో కాలింగులకు డిమాండ్ పెరగడం, జూమ్ వంటి యాప్‌లలో సెక్యూరిటీ సమస్యలు రావడంతో గూగుల్ పావులు కదుపుతోంది. ఈ సమయాన్ని చేజిక్కించుకోవాలని నిబంధనలు ఎత్తేయడం, కొత్త ఫీచర్లు యాడ్ చేస్తూ వినియోగదారులకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది.
ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటివరకు ప్రత్యేక లాగిన్‌తో ఉన్న షరతును జీమెయిల్‌తో లింకు చేయడం ద్వారా సడలించింది. ఇప్పుడు జీమెయిల్‌తో గూగుల్ మీట్‌ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఈ నెలాఖరులోగా 16 మంది ఒకేసారి మీటింగులో పాల్గొనే సదుపాయం కూడా కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జూమ్ యాప్ మాదిరిగా వీడియో క్వాలిటీ మెరుగుపరచడం, తక్కువ లైటింగులో స్పష్టంగా కనిపించడం, కీబోర్డు క్లిక్స్, తలుపు శబ్దాల వంటి బ్యాగ్రౌండ్ వీడియో నాయిస్ తొలగించడం, బ్యాగ్రౌండ్ మార్చుకునే ఫీచర్లను కూడా కల్పించబోతున్నట్లు సమాచారం. అలాగే అప్‌గ్రేడ్ చార్జీలను కూడా గూగుల్ మినహాయించనున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ కారణాల వల్ల కొన్ని దేశాలు జూమ్ యాప్‌ను నిషేధించడం గూగుల్‌కి కలిసొచ్చింది. గత రెండు వారాల నుంచి రోజుకి కనీసం 20 మిలియన్ల మంది గూగుల్ మీట్ వాడుతున్నారని ఓ టెక్నికల్ నివేదిక తెలిపింది. ఇలా కొత్త ఫీచర్లు జోడిస్తూ వెళ్తే వీడియో కాలింగ్ రంగంలో గూగుల్‌కి తిరుగుండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags: Google Meet, Hangouts, Zoom, Video calling, corona, covid, Technical, Features, video noise