గూగుల్ మ్యాప్స్‌లో.. యాక్టివిటీ ట్రాకింగ్ ఫీచర్

by Shyam |   ( Updated:2021-05-29 08:34:01.0  )
Google-Maps
X

దిశ, ఫీచర్స్: గూగుల్ మ్యాప్స్‌లో వివిధ కొత్త ఫీచర్స్‌తో పాటు, యాప్‌లో నవీకరణలు కొనసాగుతున్నాయని ఇటీవలే జరిగిన గూగుల్ ఐ/ఓ 2021లో ప్రకటించిన విషయం తెలిసిందే. గూగుల్ చెప్పినట్లుగానే తాజాగా ‘టైమ్‌లైన్’‌లో కొత్త విభాగాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు ఇప్పటికే ఉన్న లైవ్ వ్యూ ఫీచర్‌కు ఎక్స్‌పాన్షన్ అందిస్తూనే.. మోర్ డీటెయిల్డ్ స్ట్రీట్ మ్యాప్స్ అందుబాటులోకి తెచ్చింది. మెషిన్ లెర్నింగ్ సాయంతో మరింత మెరుగైన సేవలపై దృష్టిపెట్టడంతో పాటు, ట్రాకింగ్ వ్యవస్థను అందిస్తోంది.

గూగుల్ మ్యాప్స్‌లో టైమ్‌లైన్ అనే ఫీచర్ ఉండగా ఇప్పటివరకు లొకేషన్ ట్రాకింగ్‌లో ఉపయోగపడేది. ఇప్పుడు యాక్టివిటీని కూడా ట్రాక్ చేసే కొత్త ఆప్షన్ అందించింది గూగుల్. ఇది మన కదలికలపై ఒక నిర్దిష్ట వ్యవధిలో ట్రాక్ చేస్తుంది. మన కదలికలను నెలవారీ ప్రాతిపదికన ట్రాక్ చేయడానికి డ్రైవింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటి ప్రయాణ విధానాలను ట్రాక్ చేస్తుంది. ప్రతి ఎంట్రీకి కుడి వైపున ఉన్న బార్ గ్రాఫ్‌లను ఉపయోగించి వినియోగదారులు తమ యాక్టివిటీ పోల్చుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఈ ఫీచర్ మీరు ఒక నెలలో సందర్శించిన స్థలాలను ట్రాక్ చేయడంతో పాటు ఫుడ్ అండ్ డ్రింకింగ్, షాపింగ్, విమానాశ్రయం వంటి వివిధ వర్గాల ఆధారంగా మీరు అక్కడ గడిపిన సమయాన్ని విడదీస్తుందని గూగుల్ పేర్కొంది. అంతే కాకుండా మీరు మీ బిజియెస్ట్ రోజుల్లో, ఖాళీ సమయాల్లో ఎలా గడిపారో కూడా ఇందులో చూసుకోవచ్చు.

యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా సర్దుబాటు చేయడంతో, వినియోగదారులకు వారి టైమ్‌లైన్‌ను ఎడిట్ చేసుకోవడాన్ని సులభతరం చేసేందుకు గూగుల్ ప్రయత్ని్స్తుంది. ఈ ఫీచర్ ఇంకా వినియోగదారులందరికీ అందుబాటులో రాలేదు. గూగుల్ మ్యాప్స్ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

Next Story