- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్‌లో న్యూ అప్‌డేట్.. ‘యాక్టివిటీ కార్డ్స్’
దిశ, వెబ్‌డెస్క్ :
మనకు ఏ సందేహం వచ్చినా.. ఏం కొనాలన్నా.. ఏది ఎక్కడ దొరకుతుందో క్షణాల్లో తెలుసుకోవాలన్నా.. వెంటనే గూగుల్ సెర్చ్ చేసేస్తాం. ఎనీథింగ్ టూ ఎవ్రీథింగ్ గూగుల్‌లోనే వెతికేస్తాం. నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసే వాటిల్లో ఫైండింగ్ జాబ్స్, షాపింగ్, ఫుడ్ రెసిపీలదే ప్రథమ స్థానం. అయితే ఈ మూడు విభాగాలకు సంబంధించిన సెర్చ్‌ను మరింత సులభతరం చేయడానికి గూగుల్ ‘యాక్టివిటీ కార్డ్స్’ను తీసుకొచ్చింది.
నెటిజన్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ఈ యాక్టివిటీ కార్డ్స్.. మన షాపింగ్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్‌ను మనకు చూపిస్తుంది. ఉదాహరణకు.. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటని మనం సెర్చ్ చేస్తే, గూగుల్ యాక్టివిటీ కార్డు ద్వారా అలాంటి సిమిలర్ ప్రొడక్ట్స్ ఏమేం ఉన్నాయో మనకు షో చూపెడుతుంది. ఈ యాక్టివిటీ కార్డ్స్ సెర్చ్ రిజల్ట్స్ టాప్‌లో కనిపిస్తాయి. ఇందులో ఆ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన యాడ్స్ కూడా డిస్‌ప్లే అవుతాయి. జాబ్ సెర్చింగ్‌కు కూడా గూగుల్.. ఇలాంటి యాక్టివిటీ కార్డ్స్‌ను తీసుకొచ్చింది. మన జాబ్ సెర్చింగ్ హిస్టరీని బట్టి.. లేటెస్ట్ జాబ్ అప్‌డేట్స్‌తో పాటు సంబంధిత జాబ్ పోస్టింగ్స్‌ను డిస్‌ప్లే చేస్తుంది. ఫుడ్ రెసిపీల విషయంలోనూ.. ఈ యాక్టివిటీ కార్డ్స్ ఉపయోగపడనున్నాయి.
గూగుల్‌లో వచ్చిన ఈ న్యూ అప్‌డేట్.. ఈ రోజు నుంచి రోల్‌అవుట్ అవుతుంది. ఒకవేళ ఈ యాక్టివిటీ కార్డ్స్ అవసరం లేదనుకుంటే.. ‘గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్’ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు.