- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగార్థులకు గూగుల్ హెల్ప్!
ఉద్యోగం వెతుక్కోవడం ఒక పెద్ద కష్టమైన పని. దాని కోసం ఇంటర్నెట్ వినియోగించుకుంటే మాత్రం చాలా సులభమైన పని. కానీ ముందు ఇంటర్నెట్‌లో ఉద్యోగం వెతకడం రావడమనేది ఒక కళ. నౌక్రీ, మాన్‌స్టర్.. ఇలా ఎన్నో రకాల ఉద్యోగాలు కల్పించే యాప్‌లు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వారి లింక్డ్‌ఇన్ అనే సోషల్ ప్లాట్‌ఫాం కూడా ఉంది. కానీ వీటిల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు పెద్దగా ప్రాచుర్యం ఉండదు. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ వారి డొమైన్‌లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలనుకున్న వారికి ఈ యాప్‌లు, సైట్‌లు బాగా ఉపయోగపడతాయి. అందుకే ఏదో ఒకటి వినూత్నంగా చేసే గూగుల్ దృష్టి.. ఇప్పుడు ఎంట్రీ లెవల్ ఉద్యోగాల మీద పడింది. అందుకే తమ కోర్మో జాబ్స్ యాప్‌ను భారత్‌కు విస్తరించింది.
2018లో బంగ్లాదేశ్‌లో ఈ కొర్మో జాబ్స్ యాప్‌ను గూగుల్ ఆవిష్కరించింది. తర్వాత ఇండోనేషియాకు విస్తరించింది. గతేడాది గూగుల్ పే యాప్‌లో బ్రాండ్ జాబ్స్ పేరుతో ఒక స్పాట్‌గా దీన్ని భారత్‌కు తీసుకొచ్చింది. ఇది స్పాట్ మాదిరిగా ఉన్నపుడు జొమాటో, డుంజో వంటి యాప్‌లు ఎంతోమందిని ఈ స్పాట్ ద్వారా రిక్రూట్ చేసుకున్నారు. దాని పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేసి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక యాప్‌లా గూగుల్ దీన్ని ఇండియాలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న పాండమిక్ పరిస్థితుల్లో అటు పూర్తి స్థాయి ఉద్యోగాలు లేక అభ్యర్థులు, ఇటు తమకు అనుకున్న పనిని అనుకున్నట్లుగా చేయగలిగే వారు లేక పరిశ్రమలు పడుతున్న ఇబ్బందిని ఈ కొర్మో జాబ్స్ పరిష్కరిస్తుందని రీజినల్ మేనేజర్ బిక్కీ రస్సెల్ తెలిపారు.