ఇమేజ్ సెర్చ్‌కు ఫ్యాక్ట్ చెకింగ్ జోడించిన గూగుల్

by  |
ఇమేజ్ సెర్చ్‌కు ఫ్యాక్ట్ చెకింగ్ జోడించిన గూగుల్
X

తప్పుడు వార్తల విషయంలో టెక్ కంపెనీలకు తలనొప్పులు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా గూగుల్‌ ఇమేజ్‌ల శోధనా ఫలితాలకు కూడా ఫ్యాక్ట్ చెకింగ్ జోడించినట్లు గూగుల్ పితృసంస్థ ఆల్ఫాబెట్ ప్రకటించింది. ఇమేజ్ సెర్చ్‌లో థంబ్‌నెయిల్స్ కింద ఈ ఫ్యాక్ట్ చెక్ లేబుళ్లను గూగుల్ చూపించనుంది. వాటితో పాటు థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకర్ విషయాలను కూడా చూపించనున్నట్లు గూగుల్ బ్లాగు పోస్టులో ప్రకటించింది. ఇప్పటికే అమెరికాలో యూట్యూబ్‌లో వీడియోలకు కూడా గూగుల్ ఫ్యాక్ట్ చెకింగ్ లేబుల్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కరోనా విషయంలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వీడియోలకు ఈ సదుపాయంతో గూగుల్ చెక్ పెట్టింది.

నకిలీ ఖాతాలు, పోస్టుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆ పోస్టులను హోస్ట్ చేస్తున్నందుకు పోలీసులు టెక్ కంపెనీలను తప్పుబడుతున్నారు. అంతేకాకుండా ఈ తప్పుడు పోస్టుల వల్ల ఇబ్బంది పడిన వారికి టెక్ కంపెనీలు నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ వైపు నకిలీ ఖాతాల పని పడుతూనే, మరో వైపు తప్పుడు పోస్టులకు ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ లేబుల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు కూడా ఇలాంటి ఫ్యాక్ట్ చెకింగ్ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే!


Next Story

Most Viewed