- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీతో సుందర్ పిచాయ్ భేటీ.. ఏం మాట్లాడిన్రంటే..?
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వర్చువల్ భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై వీరివురు కీలక చర్చలు జరిపారు. కరోనాతో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు.. ఆఫీసుల్లో కొత్త వర్క్ కల్చర్‌పై చర్చించారు. వ్యాపారవేత్తలు, యువత, రైతుల జీవితాలను టెక్నాలజీ ఎలా మార్చగలదన్న దానిపై సమాలోచలు చేశారు. డేటా సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీపైనా చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సుందర్ పిచాయ్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని పేర్కొన్నారు.
అటు విద్య, డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ సహా పలు రంగాల్లో గూగుల్ అందిస్తున్న సేవల గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ఇక తనకు సమయం కేటాయించినందుకు ప్రధాని మోదీకి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్ ఇండియా పట్ల మీ విజన్ ప్రశంసనీయమని అన్నారు. డిజిటల్ ఇండియా దిశగా గూగుల్ ఇండియా తీసుకోబోయే తదుపరి కార్యక్రమాలు ఇవాళ వెల్లడిస్తామని సుందర్ పిచాయ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.