భౌతికదూరం పాటించడంలో గూగుల్ సాయం

by Harish |
భౌతికదూరం పాటించడంలో గూగుల్ సాయం
X

కరోనాతో కలిసి జీవించాల్సిన కాలం వచ్చేసింది. దీంతో భౌతికదూరానికి ప్రాముఖ్యత పెరిగింది. అలాగని బయటికెళ్లిన ప్రతీసారి.. అదేదో సినిమాలో హీరోయిన్‌ చెప్పినట్టుగా ‘నాకు కొంచెం స్పేస్ కావాలి’ అని ప్రతి ఒక్కరినీ అడగలేం. మనకు మనంగానే భౌతికదూరాన్ని పాటించాల్సి ఉంటుంది. కానీ, అందుకోసం ప్రతి అడుగుకు 2 మీ.ల దూరం కొలుచుకుంటూ తిరగలేం కదా! ఈ విషయంలో మనకు సాయం చేయడానికి గూగుల్ ముందుకొచ్చింది.

‘సొడార్’ పేరుతో ఒక సరికొత్త అగుమెంటెడ్ రియాలిటీ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మీ పరిసరాలను స్కాన్ చేసి 2 మీ.ల పరిధిలో ఒక వృత్తాన్ని చూపిస్తుంది. దాన్ని ఫాలో అయితే భౌతిక దూరం పాటించే సౌకర్యం కలుగుతుంది. ఇదేమీ ప్రత్యేకమైన యాప్ కాదు కాబట్టి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ద్వారా sodar.withgoogle.com అడ్రస్‌కు వెళ్తే సరిపోతుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లలోని క్రోమ్ బ్రౌజర్ ద్వారా మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకునే వీలుంది. అగుమెంటెడ్ రియాలిటీని సపోర్ట్ చేసే ఫోన్లలో ఇది పనిచేస్తోంది. ఇంకేం.. సొడార్ ఉపయోగిస్తూ భౌతిక దూరం పాటించి కరోనాను దరిచేరనివ్వకండి!

Advertisement

Next Story