- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రాంతం ఆధారంగా ఉద్యోగుల వేతనాలు
దిశ, ఫీచర్స్ : కొవిడ్ -19 మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు కొత్త మార్పులను కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే ఎంఎన్‌సీ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కల్చర్‌ను అడాప్ట్ చేసుకున్నాయి. గత డిసెంబర్ వరకు దాదాపు అన్ని కంపెనీలు దీని కొనసాగించాయి. కరోనా ఉద్ధృతి తగ్గినట్లు కనిపించడంతో కొన్ని కంపెనీలు ఆఫీస్‌ల నుంచి పని మొదలుపెట్టగా, ఐటీ ఆధారిత కంపెనీలు మాత్రం అదే కంటిన్యూ చేశాయి. ఈ విధానం ద్వారా మొదట్లో చిన్న చిన్న సమస్యలున్నా పనితీరు బాగా మెరుగుపడటంతో పాటు, కంపెనీ ఖర్చులు కూడా కలిసి వచ్చాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ బెనిఫిట్ కంపెనీకి ఉన్నట్లే, ఉద్యోగులు కూడా ఉంటాయి. దాంతో వర్క్ ఫ్రమ్ చేసే వారికి, ఆఫీసులో చేసేవారికి ఒకే రకమైన శాలరీ ఇవ్వడం సబబు కాదంటోంది గూగుల్. అందుకే పనిచేసే ప్రదేశం ఆధారంగా శాలరీ డిసైడ్ చేయబోతుంది ఆ సంస్థ.
కొత్త వర్క్ లొకేషన్ ప్లాట్‌ఫామ్‌ను ఇటీవలే లాంచ్ చేసింది గూగుల్. ఇది రిమోట్ పని కోసం శాలరీ, దాని ప్రయోజనాలను లెక్కించడానికి కంపెనీ ఉద్యోగులను అనుమతిస్తుంది. సదరు ఉద్యోగి ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లీవింగ్)తో పాటు పలు అంశాలను పరిగణలోకి తీసుకోనుంది. వీటి ఆధారంగా ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాలన్నది ఆ టూల్ లెక్కగట్టి చెబుతుంది. ఉదాహరణకు, గూగుల్ ఉద్యోగి న్యూయార్క్ లేదా శాన్‌ఫ్రాన్సిస్కో వెలుపల ఉన్న మార్కెట్‌కు లేదా ఏదైనా చిన్న ప్రదేశానికి బదిలీ చేయమని అభ్యర్థిస్తే, వారి కంపెన్‌సేషన్ తగ్గుతుంది. అదేవిధంగా వారు న్యూయార్క్, కాలిఫోర్నియా వంటి నగరాల్లో ఉంటే ఈ ప్రాంత రేట్ల ప్రకారం వారికి కంపెన్‌సేషన్ లభిస్తుంది. కొత్త వర్క్ లొకేషన్ టూల్ వారి స్థానానికి అనుగుణంగా జీతం అంచనాలను లెక్కించడానికి ఉపయోగించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా లక్ష 40వేలమంది ఉద్యోగులున్న గూగుల్‌లో, పాండమిక్ పోస్ట్ వర్క్ మోడల్‌లో 60 శాతం మంది ఉద్యోగులు వారంలో కొద్ది రోజులు మాత్రమే కార్యాలయాల్లో కలుస్తారని, 20 శాతం మంది కార్మికులు కొత్త కార్యాలయ ప్రదేశాల్లో వర్క్ చేస్తారని, ఇక మిగిలిన 20% గూగ్లర్స్ ఇంటి నుండి తమ విధులు నిర్వర్తిస్తారని గూగుల్ ప్రతినిధి తెలిపారు. అయితే ఉద్యోగులను కూడా ఎక్కడి నుంచి పని చేసుకోవాలనేది వాళ్ల స్వేచ్ఛకే వదిలేస్తున్నామని, అవసరమైతే బదిలీకి వెసులుబాటు కూడా కల్పిస్తామని ఆయన అన్నారు.
‘హైబ్రీడ్ వర్క్ వీక్’లో భాగంగా ఉద్యోగులు మూడు రోజుల పాటు ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రోజులు ఎక్కడ పనిచేయడానికి సౌకర్యంగా ఉంటే అక్కడి నుంచే విధులకు హాజరుకావచ్చు. పని, కార్యకలాపాలను బట్టి ఉద్యోగులు కలిసి పనిచేయాలన్నది నిర్ణయమవుతుంది. టీమ్‌లో ఉద్యోగుల పాత్ర, జట్టు అవసరాలను బట్టి పూర్తిగా రిమోట్ పని కోసం దరఖాస్తు చేసుకోవడానికి కంపెనీ అవకాశాలను కల్పిస్తుంది. అలా కాకుండా గూగుల్ ఉద్యోగులు సంవత్సరానికి 4 వారాల వరకు వారి ప్రస్తుత ప్రదేశానికి భిన్నమైన ప్రదేశం నుంచి తాత్కాలిక పని చేయగలరు. వేసవి సెలవుల్లో ఉద్యోగులకు మరింత సౌలభ్యం లభిస్తుంది.
– సుందర్ పిచాయ్