వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్

by Shyam |   ( Updated:2020-08-06 04:24:16.0  )
వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా, లాక్‌డౌన్ సమయంలో అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గు చూపాయి. దీంతో ప్రతీ ఒక్కరికి డేటా వినియోగం అత్యవసరమైంది. చాలా వరకు కంపెనీలు ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లు కల్పిస్తూ.. కస్టమర్ల సర్కిల్‌ను పెంచుకుంటున్నాయి. అయితే, ఈ తరహాలోనే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) నూతన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

బీఎస్ఎన్ఎల్ తాజాగా భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌ను ఏపీలో లాంఛ్ చేసింది. తెలంగాణలో కూడా ఈ సేవలు అందించనుంది. కాగా, 1500GB CS55 పేరుతో 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప్లాన్‌‌ను ఇవ్వనుంది. లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ క్రమంగా 2 ఎంబీపీఎస్ తగ్గిపోతుందని స్పష్టం చేసింది. కాగా, అక్టోబర్ 5న తెలంగాణ, అక్టోబర్ 19న ఏపీలో ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది. అలాగే, ఈ డేటా బెనిఫిట్స్‌తో పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు

ప్లాన్ వివరాలు, ధరలు:

ఏపీ, తెలంగాణలో యూజర్లకు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల వరకు ప్లాన్‌ను కొనుగోలు చేసేలా వెసులు బాటు కల్పించారు.

ధరల విషయానికొస్తే..

ఆరు నెలల ప్లాన్ ధర: రూ. 11,994
ఏడాది ప్లాన్ ధర: రూ.23,988
రెండేళ్ల ప్లాన్ ధర: 47,976
మూడేళ్ల ప్లాన్ ధర: రూ.71,964 చొప్పున చెల్లించాలని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.

Advertisement

Next Story