నిరుద్యోగులకు శుభవార్త

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఓ ప్రకటన చేసింది. తమ పరిధిలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో బోధించేందుకు సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన వివరాలు గిరిజిన గురుకుల సొసైటీ వెబ్ సైట్ లో ఉన్నాయని తెలిపింది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఈనెల 10 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది.

Advertisement