- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యార్థులకు శుభవార్త.. ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ పాస్ చేసినట్టుగా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రకటించింది. కరోనా వ్యాధి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికి కావాల్సిన మార్కులతో పాస్ చేశామని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రకటించింది. పదవ తరగతి విద్యార్థులకు కనీసం 35 మార్కులతో పాస్ చేశామని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందడానికి కావలసిన మార్కులను అందించామని వివరించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సీట్లు పొందేందుకు కావాల్సిన మార్కులను కేటాయించామని తెలిపారు.
Next Story