- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల ఆఖరుకు ఖాతాలో..
దిశ, ఏపీ బ్యూరో : ధాన్యం బకాయిలపై టీడీపీ మెుసలు కన్నీరు కారుస్తోందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని… చంద్రబాబు హయాంలో రైతులను ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో చెల్లించింది తాము ఒక్క ఏడాదిలోనే చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వలేదని టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం రెండేళ్లలో 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేంద్రం రాష్ట్ర సివిల్ సప్లైకు రూ.5,056 కోట్లు చెల్లించాలని ఇప్పటికీ చెల్లించడం లేదని తెలిపారు. ఈనెలాఖరులోగా ప్రతీ పైసా కూడా రైతుకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం, మంగళవారాల్లో రూ.1600 కోట్లు రైతుల ఖతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు.